కాజ‌ల్ కూడా... 'కాదు' పొమ్మంది!

By iQlikMovies - July 13, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

`రాజుగారి గ‌ది 3` హీరోయిన్ కోసం ఓంకార్ అన్వేష‌ణ సాగిస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో ముందుగా త‌మ‌న్నాని తీసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌న్నా అంటే తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ మార్కెట్ ఉంటుంద‌ని ఆశ ప‌డ్డాడు ఓంకార్‌. త‌మ‌న్నాతో ఈ సినిమా క్లాప్ కూడా కొట్టుకుంది. అయితే.. త‌మ‌న్నా త‌ప్పుకోవ‌డంతో ఈ ప్రాజెక్టుకు స్పీడు బ్రేకర్లు ప‌డ్డాయి.

 

త‌మ‌న్నా త‌ప్పుకోవ‌డంతో ఈ క‌థ స‌మంత‌, తాప్సి వ‌ర‌కూ వెళ్లింద‌ని చెప్పుకున్నారు. చివ‌రికి అవికా గోర్‌తో ఓకే అయ్యింద‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఈసినిమాలో ఎలాగైనా స్థార్ క‌థానాయిక‌ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని కాజ‌ల్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడ‌ట ఓంకార్‌. ఈ క‌థ కాజ‌ల్‌కీ బాగానే న‌చ్చింద‌ట‌. ఈ సినిమా చేస్తా అని మాట కూడా ఇచ్చింద‌ని తెలుస్తోంది.

 

చివ‌రికి ఏమైందో.. త‌ను కూడా ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంద‌ట‌. కాజ‌ల్ పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసింద‌ని, అంత ఇవ్వ‌లేక ఓంకార్ చేతులెత్తేశాడ‌ని చెప్పుకుంటున్నారు. కాజ‌ల్‌కి ఈమ‌ధ్య వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. భారీ ఆశ‌లుపెట్టుకున్న `సీత‌` కూడా ఫ్లాప్ అయ్యింది. కాజ‌ల్ డిమాండ్ అంత‌కంత‌కూ త‌గ్గుతుంటే - పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. చివ‌రికి ఓంకార్‌కి అవికానే దిక్క‌య్యేట‌ట్టుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS