మీకిది తెలుసా.? చందమామ న్యూ 'జర్నీ'.!

మరిన్ని వార్తలు

సీనియర్‌ నటిగా, స్టార్‌ హీరోయిన్‌గా కాజల్‌ తనదైన సత్తా చాటుతోంది. ఎంతమంది కొత్త భామలున్నా ఆమె అవకాశాలు ఆమెకే ఉన్నాయి. తమిళ, తెలుగు భాషల్లో కాజల్‌ స్థానం స్టాండర్డ్‌గా కొనసాగుతోంది. వయసుతో పాటు, కాజల్‌కి గ్లామర్‌ కూడా అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని మరింత బలంగా చెప్పేందుకు కాజల్‌ ఈ మధ్య గ్లామర్‌పై కాస్త ఎక్కువ ఫోకసే పెట్టింది. స్పెషల్‌ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. ఇదిలా ఉంటే, హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ కన్నా, కమర్షియల్‌ మూవీసే తనకు ఎక్కువ ఇష్టమని గతంలో కాజల్‌ చెప్పుకొచ్చింది. అలా అని ఆ పాత్రలు చేయనని చెప్పలేదు కానీ, దేనికైనా ఓ టైం రావాలి అని సెలవిచ్చింది చందమామ. ఆ టైం వచ్చినట్లే అనిపిస్తోంది. ఇప్పటికే, తన సహనటి అయిన సమంత హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో దూసుకెళుతోంది. ఇక ఇప్పుడు కాజల్‌ టైమొచ్చింది. తెలియలేదు కానీ, కాజల్‌ ఆల్రెడీ ఆ ట్రాక్‌ ఎప్పుడో ఎక్కేసింది.

 

ఇటీవల విడుదలైన 'సీత' సినిమాని ఆ తరహా మూవీగానే ప్రమోట్‌ చేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న 'ప్యారిస్‌ ప్యారిస్‌' హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న మూవీనే. అయితే, అచ్చమైన సోషల్‌ మెసేజ్‌ కాన్సెప్ట్‌తో కాజల్‌ త్వరలో సందడి చేయనుందట. కేవలం హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీగానే ఈ సినిమాని రూపొందించనున్నారట. ఇంతకీ ఈ సినిమాకి డైరెక్టర్‌ ఎవరో తెలుసా.? తేజ. ఆల్రెడీ మూడు సినిమాలు రూపు దిద్దుకున్న ఈ కాంబోలో నాలుగో సినిమా కూడా చర్చల దశలో ఉందట. ఈ సినిమాతో కాజల్‌ నిర్మాతగా కొత్త అవతారమెత్తనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. ఆ దిశగా కాజల్‌ కూడా విజయం సాధించాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS