కాజోల్-కరణ్ లు మళ్ళీ కలిసిపోయారు!

మరిన్ని వార్తలు

బాలీవుడ్ లో ప్రాణ స్నేహితులగా పేరుపొందిన కాజోల్-కరణ్ లు పోయిన ఏడాది జరిగిన ఒక సంఘటన వల్ల ఈ ఇద్దరు తమ స్నేహానికి దూరమయ్యారు.

దీనికి కారణం కాజోల్ భర్త స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శివాయ్ సినిమా విషయంలో కరణ్ అడ్డంకులు సృష్టించాడు అన్న ఉద్దేశ్యంతో కాజోల్-కరణ్ ల స్నేహానికి గండిపడింది. అయితే ఇవి అన్ని నిరాధార ఆరోపణలు అని కరణ్ కొట్టిపారేశాడు.

ఏదేమైనా వీరి స్నేహం పైన ఈ సంఘటన చాలా ప్రభావం చూపింది. ఇక వీరు మళ్ళీ కలవరు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో కాజోల్ తన చిరకాల స్నేహితుడైన కరణ్ కి పంపిన ఒక మెసేజ్ వాళ్ళ స్నేహాన్ని మళ్ళీ చిగురించేలా చేసింది.

ఈ మధ్యనే తన పుట్టినరోజుని జరుపుకున్న కాజోల్, తన పుట్టినరోజుకి రావాలని మెసేజ్ చేయగానే కరణ్ జోహార్ ఆ పార్టీ కి రావడంతో వారి మధ్య ఏర్పడిన తెర తోలిగినట్టయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS