లెజెండ్ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకలలో దర్శకుడు బోయపాటి శ్రీను-సంగీత దర్శకుడైన దేవి శ్రీ ప్రసాద్ ల మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికి తెలిసిందే.
ఆ సంభాషణ విన్నాక, ఇక వీరిరువురు రాబోయే కాలంలో కలిసి పనిచేసే అవకాశం ఉండబోదు అని అనుకున్నారు. కాని అందరిని షాక్ కి గురిచేస్తు వీరిరువురు జయ జానకి నాయక చిత్రానికి కలిసి పనిచేశారు.
ఇదే విషయమై కొంతమంది దేవి శ్రీ ప్రసాద్ వద్ద ప్రస్తావించగా- అసలు ఆరోజు అదేదో అనుకోకుండా జరిగిపోయిన అంశం అని, అంతే తప్ప మరేమీలేదు అని తేల్చేశాడు. ఆ సంఘటన జరిగిన రెండుమూడు రోజులకే తాము ఇద్దరం ఎప్పటిలాగానే మాట్లాడేసుకున్నాము అంటూ తెలిపాడు.
సరైనోడు చిత్రానికి కూడా తానే సంగీతం అందించాల్సి ఉండగా, తాను ఆ సమయంలో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రానికి సంగీతం ఇవ్వలేకపోయాను అని చెప్పాడు.
ఏదైతే ఏంటి.. మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండానే తమ మధ్య జరిగిన చిన్న సంఘటనని పక్కకి పెట్టేయడం నిజంగా గ్రేట్.