గరుడ వేగ తరవాత రాజశేఖర్ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. కల్కి బిజినెస్ లెక్కలే ఇందుకు సాక్ష్యం. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సినిమా బిజినెస్ పూర్తయిపోయింది. దాదాపు 11 కోట్ల ప్రీ రీలీజ్ బిజినెస్‌తో విడుదలకు ముందే కల్కీ లాభాల బాటలోకి వెళ్లింది. రాజశేఖర్ సినిమాకి ఈ రేంజ్లో బిజినెస్ జరగడం ఇదే తొలిసారి.
టీజర్, ట్రైలర్, హానెస్ట్ ట్రైలర్.. ఇవన్నీ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. దానికి తోడు.. `అ`లాంటి చిత్రంతో ఆకట్టుకన్న ప్రశాంత్ వర్మ చేసిన రెండో సినిమా ఇది. అందుకే... ఈ రేంజ్లో బిజినెస్ జరిగింది. నైజాంలో ఈసినిమాని 2.7 కోట్లకు కొన్నారు. సీడెడ్‌లో 1.7 కోట్లకు అమ్ముడైంది. ఓవర్సీస్లో కోటి రూపాయలకు పలికింది. మిగిలిన ఏరియాల్లోనూ మంచి రేట్లే వచ్చాయి.