'గరుడవేగ' సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన సీనియర్ హీరో రాజశేఖర్. అనూహ్యంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం, అనుకోకుండానే ఆ సినిమా కోసం భారీ బడ్జెట్ వినియోగించడం, పెట్టిన బడ్జెట్‌కి న్యాయం జరిగేలా వసూళ్లు రాబట్టడం అంతా.. ఏదో అలా జరిగిపోయింది. 'గరుడవేగ' ఇచ్చిన ఊపుతో రాజశేఖర్ 'కల్కి' సినిమాని ఓకే చేశారు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు.
లేటెస్ట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే, ఇది ఒకే ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న డైరెక్టర్ తీసిన సినిమాలా అనిపించడం లేదు. మేకింగ్ వేల్యూస్, టేకింగ్‌లో రిచ్‌నెస్ లెవల్స్ చూస్తుంటే, 'కల్కి'తో రాజశేఖర్‌కి మరో హిట్ ఖాయమయ్యేలానే ఉందనిపిస్తోంది. తెలంగాణాలోని కొల్లాపూర్ అనే ఊరి ఎమ్యెల్యే తమ్ముడిని ఎవరో దారుణంగా అతి కిరాతకంగా చంపేస్తారు. ఆ హత్య ఎవరు చేశారు.? అనే వివరాలు వెతికే పనిలో ఉంటాడు రాహుల్ రామకృష్ణ. ఆ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీసాఫీసర్ రాజశేఖర్. ఆ క్రమంలో ఆయనకు కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అసలు ఆ హత్యను అంత కిరాతకంగా చిత్రీకరించాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అనే దానిపై సీరియస్‌గా కల్కి చేసే ఇన్వెస్టిగేషన్ సారాంశమే 'కల్కి' కథ. టీజర్‌లో చూపించిన సస్పెన్స్‌లో కొంత ట్రైలర్ ద్వారా వీడిందనే చెప్పాలి.
మేకింగ్ వేల్యూస్ చూస్తుంటే, సినిమాకి బాగా ఖర్చు చేసినట్లే కనిపిస్తోంది. 80 ల కాలం నాటి యదార్ధ ఘటనను బేస్ చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలోనూ అన్ని రకాల పాత్రలను డిజైన్ చేయడంలోనూ డైరెక్టర్ చాలా ఇంటెన్సిటీ చూపించాడు. అయితే, తన ఇంటెన్సిటీని ఆడియన్స్‌కి కనెక్ట్ చేయడంలో ఎన్ని మార్కులేయించుకున్నాడో తెలియాలంటే, 'కల్కి' విడుదల వరకూ ఆగాల్సిందే, మరో మూడు రోజుల్లో 'కల్కి' ధియేటర్స్‌లో సందడి చేయనుంది.