తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, ఇతర సేవాకార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే ముద్దుగుమ్మ సమంతకున్న ఫాలోయింగ్ మరో ముద్దుగుమ్మకి లేదనే చెప్పాలి. పెళ్లి తర్వాత ముద్దుగుమ్మలకు సహజంగానే కాస్త క్రేజ్ తగ్గిపోతుంది. కానీ కెరీర్‌పై పెళ్లి ఎలాంటి ప్రభావం చూపడం లేదు సరికదా. పెళ్లి తర్వాత సమంత ఏది పడితే అదే బంగారమైపోతోంది. పెళ్లి తర్వాత సమంత నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి.
తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ మూవీలో నటించింది 'యూటర్న్' చిత్రం ద్వారా సమంత. ఈ సినిమా విజయం పట్ల కాస్త అనుమానాలు వ్యక్తమైనా, విడుదలయ్యాక అన్నీ పటాపంచలైపోయాయి. సినిమా అంటే పాటలు, ఫైట్లూ, రొమాన్సే కాదు అని నిరూపించింది 'యూటర్న్'తో సమంత. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయం దిశగా పరుగులు పెడుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినీ ప్రముఖులే కాక, రాజకీయ ప్రముఖుల ప్రశంసల్నీ అందుకుంటోందీ చిత్రం.
తాజాగా తెలంగాణ జాగృత వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత 'యూ టర్న్' చిత్రాన్ని చూసి పొగడ్త వర్షం కురిపించేశారు. ఈ సినిమాకి ఎక్కడా నెగిటివ్ రివ్యూస్ రావడం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకుంటోంది 'యూటర్న్'. యూటర్న్ ఇచ్చిన విజయోత్సాహంతో సమంతలో మరింత పట్టుదల పెరిగిందట. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రల్ని మరిన్ని ఎంచుకునే యోచనలో ఉందని తెలుస్తోంది.
మరోవైపు భర్త నాగచైతన్యతో సమంత ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇదికాక మరో క్రేజీ ప్రాజెక్టుకు సమంత ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఓ బిగ్‌బ్యానర్‌లో రూపొందనున్న బిగ్ ప్రాజెక్ట్ ఇది అని సమాచారమ్.