అల్లుడు.. అదరగొట్టేలానే వున్నాడు

మరిన్ని వార్తలు

తొలి సినిమా అన్న టెన్షన్‌ ఏ కొత్త హీరోకి అయినా మామూలే. అలాంటిది, మెగా కాంపౌండ్‌ నుంచి కొత్తగా ఎవరన్నా హీరో అవుతున్నాడంటే, ఆ హీరోకి వుండే టెన్షన్‌ అంతా ఇంతా కాదు. అయితే అలాంటి టెన్షన్‌ ఏమాత్రం కన్పించనీయలేదు కళ్యాణ్‌ దేవ్‌. 

తొలి సినిమా 'విజేత'తోనే నటుడిగా విజయం అందుకునేలా వున్నాడీ మెగా అల్లుడు. డాన్సుల్లో, నటనలో, ఫైట్స్‌లో పూర్తిస్థాయి శిక్షణ అనంతరమే కళ్యాణ్‌దేవ్‌ సినిమాల్లోకి వచ్చాడు. సినిమాలో కళ్యాణ్‌ దేవ్‌ ఎలా డాన్సులేశాడో ఇంకా అప్పుడే చెప్పలేం. ఎందుకంటే, అలాంటివేమీ రివీల్‌ చేయకుండా జాగ్రత్తపడ్డారు. అయితే డాన్స్‌ ట్రెయినర్‌, ఫిజిక్‌ ట్రెయినర్‌ని పరిచయం చేయడం ద్వారా ఈ సినిమా కోసం కళ్యాణ్‌దేవ్‌ ఎంత కష్టపడ్డాడో చెప్పకనే చెప్పారు. కళ్యాణ్‌దేవ్‌ ట్రెయినర్స్‌ని పరిచయం చేయడం కూడా ఇన్నోవేటివ్‌గానే వుంది. 

నటన పరంగా టీజర్‌, ట్రైలర్‌తో కళ్యాణ్‌దేవ్‌ మంచి మార్కులే వేయించుకోవచ్చనే అంచనాకి వచ్చేశారు ఆడియన్స్‌. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ నిన్న జరగ్గా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, రాజమౌళి తదితరులు హాజరై 'విజేత' టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. కళ్యాణ్‌దేవ్‌ సరసన 'విజేత' సినిమాలో మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

చిరంజీవి హీరోగా చాలాకాలం క్రితం వచ్చిన 'విజేత' సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి తగ్గట్టుగానే తండ్రీ, కొడుకుల మధ్య ఎమోషన్స్‌ నేపథ్యంలో ఈ కొత్త 'విజేత' రూపొందినట్లు కన్పిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS