మెగా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చీ' అంటూ ఈ మధ్యనే రెండో సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రిజ్వాన్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రమిది. బుల్లితెరపై సీరియల్ డైరెక్టర్‌గా అనుభవం ఉన్న పులివాసు ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా ప్రమోట్ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రచితా రామ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. అయితే, ఈ సినిమాలో రియా చక్రవర్తిని హీరోయిన్‌గా ఎప్పుడో అనౌన్స్ చేశారు.
తాజాగా జరుగుతోన్న ప్రచారాన్ని బట్టి, అంటే, మెగా అల్లుడు ఇద్దరు భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి సిద్ధమవుతున్నాడనుకోవాలి. అయితే, రచితా రామ్ ప్రచారంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక రచితా రామ్ విషయానికి వస్తే, ఈ బ్యూటీ పేరు ఇప్పుడు వినబడడమే కాదు, ఎప్పుడో బాలయ్య సినిమాతో ఈ భామ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే, అప్పుడు కూడా జస్ట్ ప్రచారంతోనే సరిపెట్టుకుంది. మరి ఇప్పుడు కూడా అలాగే అవుతుందా.? లేక నిజంగానే మెగా చిన్నల్లుడితో జోడీ కట్టనుందా.? చూడాలిక.
ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 22 నుండి 'సూపర్ మచ్చీ..' తాజా షెడ్యూల్ మొదలు కానుంది. 'విజేత' సినిమాతో హీరోగా తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్న కళ్యాణ్‌దేవ్ 'సూపర్ మచ్చీ..' అంటూ తనలోని ఏ కొత్త యాంగిల్ చూపించబోతున్నాడో చూడాలి మరి.