రీమేక్స్ స్పెషలిస్ట్‌గా విక్టరీ వెంకటేష్‌కి టాలీవుడ్‌లో మంచి పేరుంది. అంతేకాదు, వెంకీ టచ్ చేసిన రీమేక్స్ అన్నీ ఆయనకు మంచి విజయాలే అందించాయి. ఓ తమిళ రీమేక్ హక్కుల్ని వెంకీ కోసం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ దక్కించుకున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అదే ధనుష్ నటించిన 'అసురన్' రీమేక్. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాని లేటెస్ట్‌గా అమెజాన్‌లో వదిలేశారు. అమెజాన్‌లో వచ్చిన ఈ సినిమాని చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా వీక్షించేశారు. ఆల్రెడీ చూసిన సినిమాని రీమేక్ చేస్తే, కిక్కేముంటుంది. మళ్లీ చూసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు కూడా. కానీ, రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు కాబట్టి, ఈ సినిమాని తెరకెక్కించాల్సిందే. అందుకే వెంకీ డెసిషన్ ఛేంజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ సినిమాని ఉన్నది ఉన్నట్లు తీసేయకుండా, చాలానే మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నారట. ఆ దిశగా దర్శక, నిర్మాతలకు సూచనలిస్తున్నాడట. వెంకీ నటించిన 'దృశ్యం', 'గురు' సినిమాలను ఏదో ఒకటీ అరా మార్పులు మినహాయిస్తే, మక్కీ మక్కీ తెలుగులో రీమేక్ చేసినవే. కానీ, 'అసురన్' విషయంలో ఆ పప్పులుడికేలా లేవ్. స్క్రిప్టులో చాలా మార్పులు చేయాలట. ఇదంతా చేయాలంటే, కాస్త ఎక్కువ టైమే పట్టేలా ఉందట. సో ఇప్పుడప్పుడే వెంకీ నుండి 'అసురన్' రీమేక్ ఎక్స్‌పెక్ట్ చేయలేమని, ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకీ 'వెంకీ మామ' సినిమాతో బిజీగా ఉన్నాడు. డిశంబర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.