ట్రెండింగ్‌ బాగుంది.. కానీ, నిరాశే మిగిలింది.!

మరిన్ని వార్తలు

'టీజర్‌ లోడింగ్‌..' అంటూ 'సరిలేరు..' డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సోషల్‌ మీడియా వేదికగా తెగ హడావిడి చేశాడు. ఈ హడావిడి చూసి, ఇంకేముంది, 'సరిలేరు..' టీజర్‌ రానుందన్న మాట.. అని ఫ్యాన్స్‌ కొండంత ఆశతో ఎదురు చూశారు. కానీ, వారి ఆశ నిరాశే అయ్యింది. టీజర్‌ వచ్చింది. కానీ, అది టీజర్‌ కాదు. జస్ట్‌ ఏ వీడియో. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, ఏమీ లేదు.. గన్‌ ట్రిగ్గింగ్‌ చేస్తూ ఆర్మీ డ్రెస్‌లో నడుచుకొస్తున్న మహేష్‌ బాబు వీడియో అది. అంతే. ఇంకేముంది టీజర్‌ వచ్చేస్తుందేమో అనుకున్న అభిమానుల ఆశలపై అనిల్‌ రావిపూడి నీళ్లు చల్లేశాడు. కానీ, ఈ జస్ట్‌ వీడియోనే ఇప్పుడు ట్రెండింగ్‌ అయిపోయింది.

 

విడుదల చేసిన కొన్ని సెకన్లలోనే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఈ వీడియో. 'సరిలేరు నీకెవ్వరూ..' టీజర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఈ వీడియో ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయిపోతోంది. 'ఎప్పుడొచ్చామన్నది కాదన్నా, బుల్లెట్‌ దిగిందా లేదా.?' అని తన డైలాగ్‌ తనకే ఆపాదించేసుకున్నట్లయ్యింది ఈ వీడియోతో. ఇంతవరకూ 'అల వైకుంఠపురములో..' ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తున్న బన్నీ ఫ్యాన్స్‌కి ఈ ఒక్క వీడియోతో సమాధానం చెప్పేశామని ఫీలయిపోతున్నారు మహేష్‌ ఫ్యాన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS