మెగాస్టార్‌ అల్లుడు మామూలోడేం కాదు.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ఈ సినిమాకి 'విజేత' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటైన 'విజేత' టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టి, అప్పుడే సగం మార్కులు కొట్టేసింది చిత్ర యూనిట్‌. రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వారాహి బ్యానర్‌లో రూపొందుతోంది. 

ఎన్నో అభిరుచి గల సినిమాలను తెరకెక్కించింది వారాహి బ్యానర్‌. బ్యానర్‌ పరంగా కూడా ఈ సినిమాకి గుడ్‌ సైన్‌ కనిపిస్తోంది. ఇకపోతే రేపు ఉదయం 'విజేత' టీజర్‌ విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ, చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇంతవరకూ కళ్యాణ్‌దేవ్‌ అంటే హీరోగా ఎలా ఉండబోతాడో అనే అనుమానాలన్నీ ఈ పోస్టర్‌తో పటా పంచలైపోయాయి. కళ్యాణ్‌లో ఏదో విషయం ఉన్నట్టే కనిపిస్తోంది. చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడీ పోస్టర్‌లో కళ్యాణ్‌దేవ్‌. 

చేతిలో బ్యాగ్‌ పట్టుకుని మస్టర్డ్‌ కలర్‌ ఫార్మల్‌ షర్ట్‌, నేవీ బ్లూ కలర్‌ జీన్స్‌లో లైట్‌గా గెడ్డంతో హ్యాండ్‌సమ్‌ అండ్‌ డిగ్నిఫైడ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడీ మెగా హీరో. ఈ అప్పియరెన్స్‌తోనే టాలీవుడ్‌కి మరో మంచి హీరో దొరికాడనిపించేలా ఫస్ట్‌ అప్పీల్‌తోనే బెస్ట్‌ ఇంప్రెషన్‌ కలిగిస్తున్నాడు దేవ్‌. తనకు నటనపై ఆశక్తి ఉందన్న విషయం మామగారైన చిరంజీవికి చెప్పడం, వెంటనే చిరంజీవి ఒప్పుకోవడం, దేవ్‌లో సమ్‌థింగ్‌ ఏదో విషయం ఉందనీ ఆ విషయాన్ని మొదట్లోనే చిరంజీవి గుర్తించి ఉండి ఉండాలి. 

ఇక రేపు రాబోయే టీజర్‌ చూస్తే, ఇంకా ఓ క్లారిటీకి వచ్చేయొచ్చు. ఈ సినిమాలో కళ్యాణ్‌కి జోడీగా ముద్దుగుమ్మ మాళవికా శర్మ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS