బాకీ పడ్డానంటోన్న విశాల్‌

మరిన్ని వార్తలు

తమిళ హీరో విశాల్‌ తెలుగు వాడైనా తమిళంలో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. తెలుగులో ఇంతవరకూ ఒక్క స్ట్రెయిట్‌ సినిమా కూడా చేయలేదు విశాల్‌. కానీ ఆయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయం అందుకుంటున్నాయి. అందుకే తెలుగు వారికి బాకీ పడ్డానంటున్నాడు విశాల్‌. 

తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈ విషయంలో నన్ను తెలుగు ఆడియన్స్‌ క్షమించాలని తెలుగువారిని ఉద్దేశించి విశాల్‌ అన్నాడు. ఇటీవల విశాల్‌ నటించిన 'ఇరుంబుతిరై' సినిమా తెలుగులో 'అభిమన్యుడు' టైటిల్‌తో విడదలైంది. మంచి విజయం అందుకుంది. ఎప్పుడూ విశాల్‌ నటించిన అనువాద చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ దక్కుతుంటుంది. ఆ రకంగా తెలుగులో విశాల్‌ మార్కెట్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాడు. 

అసలు సిసలు తెలుగోడైన విశాల్‌ తమిళంలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ తెలుగులో సినిమా చేయలేకపోయాడు ఇంతవరకూ. తెలుగు ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేసేలా ఓ మంచి కథతో స్ట్రెయిట్‌ తెలుగు సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తానని మాటిస్తున్నాడు విశాల్‌. 'అభిమన్యుడు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు ఆడియన్స్‌తో తన మనసులోని భావాల్నిలా పంచుకున్నాడు విశాల్‌. 'అభిమన్యుడు'లో విశాల్‌ సరసన ముద్దుగుమ్మ సమంత హీరోయిన్‌గా నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS