మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'రేయ్' సినిమాతో తెరంగేట్రం చేసినా, 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా నుండే తేజు కెరీర్‌ని లెక్కల్లోకి తీసుకోవాలి. ఆ సినిమాతో స్టార్ట్ చేసి, వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత నుండీ తేజు కెరీర్‌కి గండి పడింది. 'విన్నర్', 'జవాన్' సినిమాలతో జస్ట్ ఓకే అనిపించుకున్నట్లే అనిపించుకుని తర్వాత ఫెయిల్యూర్స్ లిస్టులోకి వెళ్లిపోయాడు. దాంతో తేజు మార్కెట్‌ని పూర్తిగా పోగొట్టుకున్నాడు.
'సుప్రీమ్' సినిమాతో 20 నుండి 30 కోట్ల వరకూ చేరిన తేజు మార్కెట్ ఇప్పుడు దారుణంగా పడిపోయింది. ఆ మార్కెట్‌ని సొంతం చేసుకోవాలంటే తేజు సూపర్ డూపర్ హిట్ కొట్టి తీరాలి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'తేజ్ ఐ లవ్‌యూ' సినిమాతోనూ భారీగా నిరాశ పరిచేశాడు తేజు. టోటల్‌గా బోల్తా కొట్టేసినట్లే ఈ సినిమాతో.
ఇకపోతే ఇప్పుడు మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ వస్తున్నాడు. మామ చిరంజీవి సినిమా టైటిల్ అయిన 'విజేత' టైటిల్‌తోనే అల్లుడు కూడా వస్తున్నాడు. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయింతవరకూ. అయితే విడుదలయ్యాక ఏం చేస్తాడనే దానిపైనే అసలు రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇంతవరకూ ప్రోమోస్ ద్వారా కళ్యాణ్‌దేవ్ బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ రాకేష్ శశి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. వారాహి బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
చూడాలి మరి మేనల్లుడు నిరాశపరిచాడు. చిన్నల్లుడు ఏం చేస్తాడో.