డైరెక్టర్‌ని పార్ట్‌నర్‌గా చేసుకున్న 'బంగార్రాజు'!

By iQlikMovies - June 28, 2019 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

నాగార్జున హీరోగా తెరకెక్కిన 'సోగ్గాడే చిన్నినాయనా' సూపర్‌ గుడ్‌ ఫిలింగా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుని, మంచి విజయం అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్‌ రూపొందించాలని ఎప్పటి నుండో నాగ్‌ అనుకుంటున్న సంగతి తెలిసిందే. 'సోగ్గాడే చిన్ని నాయనా' డైరెక్టర్‌ కళ్యాణ్‌కృష్ణ గత రెండేళ్లుగా ఈ స్క్రిప్టుపై వర్క్‌ చేస్తున్నాడు కూడా. దీన్నో డ్రీమ్‌ ప్రాజెక్టుగా డీల్‌ చేస్తున్నాడట కళ్యాణ్‌ కృష్ణ. అందుకే ఎలాగైనా ఈ సినిమా తెరకెక్కించాలన్న కసితో ఉన్నాడట. అందుకు నాగార్జున సపోర్ట్‌ కూడా బాగానే ఉందని తెలుస్తోంది.

 

అయితే, కళ్యాణ్‌కృష్ణకు ఈ సినిమాలో రెమ్యునరేషన్‌ లేదంటూ ప్రచారం జరుగుతోంది గత కొంతకాలంగా. ఆ ప్రచారం నిజమేననిపిస్తోంది. ఎందుకంటే, కళ్యాణ్‌కృష్ణను నాగార్జున తన బిజినెస్‌ పార్ట్‌నర్‌గా తీసుకున్నాడట. ఈ సినిమాని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో కళ్యాణ్‌కృష్ణను కూడా భాగస్వామిని చేశాడట. ఈ డీల్‌కి కళ్యాణ్‌కృష్ణ ఒప్పుకోవడంతో త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందనీ తెలుస్తోంది. 'మన్మధుడు 2' తర్వాత నాగార్జున చేయబోయే చిత్రం ఇదేనని అంటున్నారు.

 

ఈ సినిమాకి 'బంగార్రాజు' టైటిల్‌ ఎప్పటి నుండో నలుగుతోంది. సో అదే టైటిల్‌ ఫిక్స్‌ చేసే అవకాశముంది. ఈ సినిమాకి స్పెషల్‌ అట్రాక్షన్‌ ఏంటంటే, ఇది మల్టీ స్టారర్‌ మూవీగా రూపొందుతుండడం. అక్కినేని తండ్రీ కొడుకులు, నాగ్‌, చైతూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. నాగార్జునది 'సోగ్గాడే..'లోని బంగార్రాజు పాత్రేనట. కానీ, చైతూ క్యారెక్టర్‌ విషయంలోనే కొంత సస్పెన్స్‌ నెలకొంది. మనవడి పాత్రలో నటిస్తాడా.? లేక చైతూ కోసం ఇంకేదైనా రిలేషన్‌ యాడ్‌ చేశాడా డైరెక్టర్‌ అనేది సినిమాలోనే చూడాలట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS