క‌ల్యాణ్ రామ్ #17: ఈసారి ఫ్యామిలీ ట‌చ్‌

By iQlikMovies - June 12, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

నంద‌మూరి హీరోల సినిమాల‌న‌గానే మాస్‌, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ల‌కే ప్రాధాన్యం. ఆ జోన‌ర్ల‌లోనే వాళ్లంతా హిట్లు కొట్టారు. క‌ల్యాణ్ రామ్ కూడా అంతే. త‌న తొలి హిట్ అత‌నొక్క‌డే నుంచి ప‌టాస్ వ‌ర‌కూ అన్ని హిట్లూ ఈ జోన‌ర్‌లో వ‌చ్చిన‌వే. అయితే క‌ల్యాణ్ రామ్ రూటు మార్చాడు. ఈసారి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో కొత్త ట‌చ్ ఇవ్వ‌బోతున్నాడు. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా స‌తీష్ వేగ్నేశ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది.

 

ఆదిత్య మ్యూజిక్స్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్ట‌బోతోంది. మెహ‌రీన్ క‌థానాయిక‌. గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. `శ‌త‌మానం భ‌వ‌తి`లాంటి కుటుంబ క‌థా చిత్రంతో ఆక‌ట్టుకున్నారు స‌తీష్ వేగ్నేశ‌. ఇప్పుడు కూడా అలా కుటుంబ బంధాల‌తో సాగే క‌థ‌నే చెప్ప‌బోతున్నార్ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. జులై నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లెట్టే అవ‌కాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS