కల్యాణ్ రామ్ కథానాయకుడిగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తానే నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొత్త కుర్రాడు వశిష్ట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా `బింబిసార` అనే పేరు ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే ఇదో పిరియాడిల్ డ్రామా అనే సంగతి అర్థం అవుతోంది.
చేతిలో కత్తి పట్టుకుని, యుద్ధ రంగంలో శత్రువుల తలలు వంచిన.. వీరుడిగా... కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. చరిత్ర పుస్తకాల్లో బింబిసారుడు అనే చక్రవర్తికి ప్రత్యేకమైన పేజీ ఉంది. కేవలం 15 ఏళ్లకే చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్టించాఉడ. 5వ శతాబ్దానికి చెందిన బింబిసార... బుద్ధుడి స్నేహితుడు. ఈ కథకీ... ఈ కథకీ ఏమైనా సంబంధం ఉందా? లేదంటే పేరు మాత్రమే వాడుకున్నారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.