నాగశౌర్య వచ్చేశాడోచ్‌.!

మరిన్ని వార్తలు

ఇటీవల షూటింగ్‌లో గాయపడిన కారణంగా యంగ్‌ హీరో నాగశౌర్య బెడ్‌ రెస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్‌ అయిన ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న సినిమాకి సంబంధించిన షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతుండగా, దురదృష్టవశాత్తూ గాయపడి, కాలికి ఫ్రాక్చర్‌ అయిన కారణంగా, షూటింగ్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది.

 

వైద్యులు ఆయనకు కొన్ని వారాలు రెస్ట్‌ తీసుకోమని సూచించారు. కానీ, తన కారణంగా మిగిలిన ఆర్టిస్టుల డేట్స్‌కి ఇబ్బంది కాకూడదనే కారణంతో ఇంకా వైద్యులు సూచించిన సమయం పూర్తి కాకుండానే తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాడు నాగశౌర్య. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఆన్‌ లొకేషన్‌ ఫోటోలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ సారి కొంచెం అప్రమత్తతతో వ్యవహరించనున్నాడట ఈ యంగ్‌ హీరో. ఎందుకంటే హీరో గాయపడితే, షూటింగ్‌ వాయిదా వేయడం తప్ప మరో ఆప్షన్‌ లేదు చిత్ర యూనిట్‌కి. షూటింగ్‌ వాయిదా పడడంతో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఈ మధ్య యంగ్‌ హీరోలు రిస్క్‌లకు పోయి, డూప్స్‌తో పని లేకుండా, ప్రమాదకర షాట్స్‌లో పాల్గొంటూ, కోరి ప్రమాదాలను కొని తెచ్చుకున్న పరిస్థితుల్ని వరుసగా చూశాం.

 

దాంతో ఇక నుండి మన యంగ్‌ హీరోలు, అంతకు మించి జాగ్రత్తలతో సెట్స్‌లోకి దిగాలని నిర్ణయించుకున్నారట. డెడికేషన్‌ ఉండడం మంచిదే. కానీ, అది శృతి మించి ఇదిగో ఇలా కాకూడదంతే. మొత్తానికి మన యంగ్‌ హీరోల నిర్ణయం ఆహ్వానించదగ్గదే. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న సినిమాలో మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రమణ తేజ అనే యంగ్‌ డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరోవైపు నాగశౌర్య నటించిన 'ఓ బేబీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS