మోహన్‌బాబుకీ, కళ్యాణ్‌రామ్‌కీ పోలికేంటబ్బా.!

By iQlikMovies - March 23, 2018 - 07:00 AM IST

మరిన్ని వార్తలు

మోహన్‌బాబు హీరోగా నటించిన 'అసెంబ్లీ రౌడీ' చిత్రం మోహన్‌బాబు కెరీర్‌ బెస్ట్‌ మూవీస్‌లో ఒకటిగా చెప్పొచ్చు. ఆ సినిమాలో ఎమ్యెల్యే పాత్రలో డిగ్నిటీ చూపిస్తూనే, మోహన్‌బాబు పండించిన కామెడీని ఎవ్వరూ మర్చిపోలేం. అలాంటి తరహా కథతోనే ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌ వస్తున్నాడు 'ఎమ్మెల్యే' సినిమాతో. పొలిటికల్‌ టచ్‌ ఉన్న ఈ సినిమాలో కామెడీ డైలాగ్స్‌ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయట. 

అలాగే కళ్యాణ్‌రామ్‌లోని ఓ కొత్త యాంగిల్‌ని చూపిస్తానంటున్నాడు ఈ సినిమా ద్వారా. అది కూడా కామెడీతో పాటు సీరియస్‌ యాంగిల్‌ అట. ఎమ్యెల్యే అంటే పూర్తిగా పొలిటికల్‌ మూవీ అనుకున్నారు. నిజానికి 'ఎమ్మెల్యే' అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి అని అర్ధమట ఈ సినిమాలో. అయితే ఈ మంచి లక్షణాలున్న అబ్బాయి పోలిటిక్స్‌లో ఏం చేస్తాడట మరి. అంటే మా సినిమా చూడాలంటున్నారు కళ్యాణ్‌రామ్‌. ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రేక్షకుల ముందుకు ఈరోజు రానుందీ సినిమా. 

ఈ ఎమ్మెల్యే హీరోయిన్‌తో రొమాన్స్‌ కూడా చేసేస్తాడు. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌తో జత కడుతోంది. ప్రచార చిత్రాల్లో ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 'ఎమ్యెల్యే' సంగతిటుంచితే, ఈ సినిమా తర్వాత ఓ డిఫరెంట్‌ మూవీలో నటించేందుకు కళ్యాణ్‌రామ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ సినిమా వివరాలేంటో త్వరలో చెబుతాడట. అయితే అది ఓ మల్టీ స్టారర్‌ కావచ్చునంటున్నాడు. అయితే ఆ మల్టీ స్టారర్‌ ఎవరితోననేది మేలో క్లారిటీ ఇస్తానంటున్నాడు కళ్యాణ్‌రామ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS