'118' ట్రైల‌ర్ టాక్‌: క్యూరియాసిటీ పెంచేలా ఉంది!

మరిన్ని వార్తలు

క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్లే న‌మ్ముకుంటూ ప్ర‌యాణం సాగిస్తున్నాడు. త‌ను త‌న కెరీర్‌లోనే తొలిసారి ఓ థ్రిల్ల‌ర్ స్టోరీని ఎంచుకున్నాడు. అదే '118'. కె. వి. గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నివేదా థామ‌స్, షాలినీ పాండే క‌థానాయిక‌లుగా న‌టించారు. 118 అనే టైటిల్‌తోనే ఆస‌క్తి పెంచిన కళ్యాణ్ రామ్‌.. ఇప్పుడు ట్రైల‌ర్‌తో దాన్ని మ‌రింత రెట్టింపు చేశాడు.

 

క‌ల‌లోకి వ‌చ్చిన ఓ అమ్మాయి... నిజంగానే ఉందా, లేదా? అంటూ అన్వేషిస్తూ ఓ అబ్బాయి సాగించిన ప్ర‌యాణం ఇది. ఆ అమ్మాయికీ 118 అనే అంకెకీ ఉన్న సంబంధం ఏమిట‌న్న‌ది అస‌క్తి క‌లిగిస్తోంది. హై ఓల్టేజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా నిండిపోయింద‌నిపిస్తోంది. ''మొద‌లెట్టింది ఏదైనా మ‌ధ్య‌లోనే ఆపేయాలంటే నాకు చిన్న‌ప్ప‌టి నుంచీ చెడ్డ చికాకు... ఏంటో ఈ వెధ‌వ క్యూరియాసిటీ'' అంటూ కళ్యాణ్ రామ్‌తో ఓ డైలాగ్ ప‌లికించారు. ఆ డైలాగ్ ని బ‌ట్టి ఈ క‌థ గ‌మ‌నాన్నీ, క‌థానాయ‌కుడి పాత్ర ప్ర‌వ‌ర్తించే తీరునీ అర్థం చేసుకోవొచ్చు. మార్చి 1న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS