మోహ‌న్ బాబు పాత్ర‌ పాజిటీవా? నెగిటీవా??

మరిన్ని వార్తలు

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ... సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారింది. ఇందులో చంద్ర‌బాబు పాత్ర‌ని ఎలా చూపిస్తారో అన్న ఆస‌క్తి రోజు రోజుకీ పెరుగుతోంది. బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ లాంటి పాత్ర‌లూ ఈ చిత్రంలో కీల‌కం కానున్నాయి. అయితే అనూహ్యంగా మోహ‌న్ బాబు పాత్ర వెలుగులోకి వ‌చ్చింది. ట్రైల‌ర్లో మోహ‌న్ బాబుని పోలిన ఓ పాత్ర క‌నిపించింది. ట్రైల‌ర్‌లో ఓ డైలాగ్‌ని మోహ‌న్ బాబు మాడ్యులేష‌న్ లో చెప్పించారు. 

 

పైగా మోహ‌న్ బాబు త‌ర‌చూ ఓ హ్యాట్ పెట్టుకుని క‌నిపించేవారు. అలాంటి హ్యాటే.. ఆ పాత్ర కూడా పెట్టుకుంది. ఇదంతా చూస్తే.. అది మోహ‌న్ బాబు పాత్రేమో అనిపిస్తోంది. అయితే.. ఆ పాత్ర‌ని నెగిటీవ్ గా చూపించారా? పాజిటీవ్‌గా చూపించారా? అనేది ఆస‌క్తిక‌రం. ఎన్టీఆర్‌కి మోహ‌న్ బాబు అత్యంత స‌న్నిహితంగా ఉండేవారు. ఆయ‌న ఇంట‌ర్వ్యూల‌లోనూ త‌ర‌చుగా ఎన్టీఆర్‌ని ప్ర‌స్తావిస్తుంటారు. ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో ఆయ‌న‌తో మేజ‌ర్ చంద్ర‌కాంత్ అనే సూప‌ర్ హిట్ సినిమా తీశారు. 

 

కాక‌పోతే.. చంద్ర‌బాబు వెన్నుపోటు నేప‌థ్యంలో మోహ‌న్ బాబు కూడా ఎన్టీఆర్‌ని విడ‌చి... బాబు పంచ‌న చేరారు. మ‌రి ఈ సినిమాలో మోహ‌న్ బాబు పాత్ర‌ని అలానే చూపిస్తారా?  లేదంటే కేవ‌లం పాజిటీవ్ కోణ‌మే ప్ర‌తిబింబిస్తారా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవ‌ల మోహ‌న్ బాబు కుటుంబంతో స‌న్నిహితంగా ఉంటున్నారు వ‌ర్మ‌. ఆ కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి రౌడీ, అనుక్ష‌ణం లాంటి సినిమాలు చేశారు. ఈ నేప‌థ్యంలో మోహ‌న్ బాబుని నెగిటీవ్‌గా చూపిస్తారా?  అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS