జనవరి పైనే కన్నేసిన కళ్యాణ్‌రామ్‌.!

By iQlikMovies - December 10, 2018 - 16:11 PM IST

మరిన్ని వార్తలు

'ఎమ్మెల్యే' సినిమా తర్వాత నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న చిత్రం '118'. గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కథా, కథనాలు చాలా ఆశక్తికరంగా ఉండబోతున్నాయట. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ప్రతీ సన్నివేశాన్ని ఉత్కంఠభరితంగా తెరకెక్కించారట. కళ్యాణ్‌రామ్‌ సాహసాలు అబ్బురపరిచేలా ఉంటాయని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కళ్యాణ్‌రామ్‌ డీప్‌ డైవింగ్‌లో శిక్షణ తీసుకున్నారట. పతాక సన్నివేశాలు ఈ డీప్‌ డైవింగ్‌ రిలేటెడ్‌గా ఉంటాయట. అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయట. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ సరసన నివేదా థామస్‌, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా లాస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. జనవరిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక టైటిల్‌ '118' పరంగా కూడా ఈ సినిమా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. అసలీ టైటిల్‌కి మీనింగ్‌ ఏంటనే విషయమై త్వరలో చిన్న హింట్‌ ఇవ్వనున్నారట. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో 'పటాస్‌' సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకుంది. మళ్లీ ఆ స్థాయి హిట్‌ని కళ్యాణ్‌రామ్‌ '118' ద్వారా అందుకుంటాడనీ ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS