హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శన్ తొలి సినిమాతోనే తెలుగులో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నిర్మాత అక్కినేని నాగార్జున నిర్మించిన 'హలో' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోనికి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
సినిమాలో 'ఐ హేట్ యు' అన్న మాటకి అర్ధం మార్చేశారు. 'ఐ హేట్ యు' అంటే మరింతగా ప్రేమించడం అని అర్ధమనీ దర్శకుడు విక్రమ్ కుమార్ కొత్తగా చెప్పించాడు. యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయిందిది. ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన కళ్యాణీకి ఆమె అభిమానులు సరదాగా 'ఐ హేట్ యూ' చెబుతున్నారట. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో తనకి వస్తున్న 'ఐ హేట్ యూ' మెసేజ్‌ల గురించి దర్శకుడు విక్రమ్ కుమార్‌తో చెప్పింది.
ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే, అది ఈ సినిమా కారణంగానే. 'ఐ హేట్ యూ సార్' అంటూ విక్రమ్ కుమార్‌పై తన అభిమానాన్ని చాటుకుంది కళ్యాణీ. దర్శకుడు ప్రియదర్శన్ మాజీ హీరోయిన్ లిజీల కుమార్తె అయిన కళ్యాణీ ప్రియదర్శన్ చిన్నప్పటి నుండే సినిమాలపై ఆశక్తి పెంచుకుందట. తెలుగులో తొలి సినిమానే ఆమెకి బిగ్ బ్యానర్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఆమెకు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించిందనీ 'హలో' ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈ సినిమా సక్సెస్‌తో కళ్యాణీకి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట.