నేను చాలా సెన్సిటివ్‌ అంటోన్న 'హలో' బ్యూటీ

By iQlikMovies - July 06, 2018 - 18:15 PM IST

మరిన్ని వార్తలు

'హలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కళ్యాణీ ప్రియదర్శన్‌. ఫిల్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నిజానికి నటి కావాలనుకోలేదట. తండ్రి వారసత్వంగా నిర్మాణ రంగం వైపు వెళ్లాలనుకుందట. కానీ తల్లి వారసత్వాన్ని అంది పుచ్చుకోవాల్సి వచ్చిందంటోంది. అలనాటి నటి లిజీ, ప్రముఖ నిర్మాత ప్రియదర్శన్‌ సంతానమే కళ్యాణి. అయితే అనుకోకుండా నటి అయినా కానీ, తొలి సినిమాతోనే నటనలో మంచి మార్కులు కొట్టేసింది. 

'హలో' సినిమాలో అఖిల్‌ సరసన హీరోయిన్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ తన సోల్‌ మేట్‌ కోసం చిన్నతనం నుండీ ఎదురు చూసే అమ్మాయి జున్ను పాత్రలో తనదైన యాక్టింగ్‌ టాలెంట్‌ కనబరచి, అందరి మనసుల్ని దోచుకుంది. ఇప్పుడు శర్వానంద్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. టాలెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు అనడానికి కళ్యాణీ ఓ చక్కని ఉదాహరణ అని చెప్పొచ్చు. తొలి సినిమాకి తనని తాను తెరపై చూసుకున్నాక కళ్యాణికి నమ్మకం వచ్చిందట. 

ఎలాంటి పాత్రనైనా తాను డీల్‌ చేయగలనన్న సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ తనకి కలిగిందంటోంది. అంతేకాదు, తను చాలా సెన్సిటివ్‌ అనీ, అందుకే తెరపై తన నటనకు ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతోనే ముఖం చూపించకుండా, టెక్నికల్‌ ఫీల్డ్‌లో తన టాలెంట్‌ చూపించాలని అనుకుందట. 

కానీ తొలి సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌కి ఆ భయం పోయిందంటోంది అందాల భామ కళ్యాణీ ప్రియదర్శన్‌. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్న తపనే కానీ, బిజీగా సినిమాలు చేసేయాలన్న ఆలోచన లేదంటోందీ ముద్దుగుమ్మ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS