'హలో' బ్యూటీ అంత బిజీనా?

మరిన్ని వార్తలు

'హలో'తో డెబ్యూ చేసి, తొలి సినిమాకే నటిగా మంచి పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్‌. ఫిల్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ నుండి వచ్చినా, గ్లామర్‌కి తక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చి పర్‌ఫామెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మంచి మంచి పాత్రలు ఎంచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఇటీవల తెలుగులో 'చిత్రలహరి' సినిమాతో సాయి ధరమ్‌కి హిట్‌ ఇచ్చింది. ఇక తదుపరి శర్వానంద్‌తో 'రణరంగం' సినిమాలో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

 

మరోవైపు కళ్యాణీ ప్రియదర్శన్‌ తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆల్రెడీ కోలీవుడ్‌ సెన్సేషనల్‌ యంగ్‌ హీరో శివకార్తికేయన్‌తో కలిసి 'వాన్‌' అనే సినిమాలో నటిస్తోంది. మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌తో మరో సినిమాలో నటిస్తోంది. తాజాగా సీనియర్‌ హీరో శింబు సరసన హీరోయిన్‌గా ఎంపికైంది కళ్యాణీ. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మానాడు' సినిమాలో కళ్యాణీ హీరోయిన్‌గా ఎంపికైంది. కళ్యాణీలో ప్రత్యేకత ఏంటంటే, ఆమె చబ్బీ చీక్స్‌ క్యూట్‌ అప్పీల్‌ ఇస్తూ, యంగ్‌ హీరోస్‌ పక్కనా హీరోయిన్‌గా సెట్‌ అయిపోతుంది.

 

ఆమె బాడీ లాంగ్వేజ్‌లోని హుందాతనం సీనియర్‌ హీరోస్‌నీ మ్యాచ్‌ చేస్తుంది. అదే ఆటిట్యూడ్‌ శింబు సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ దక్కేలా చేసింది కళ్యాణీకి. హీరోయిన్‌గా ఏదో ఓ మోస్తరు ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదట ఈ సినిమాలో కళ్యాణీ పాత్ర. చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రనీ తెలుస్తోంది. సో ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయితే, తమిళ నాట కళ్యాణీ స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోవడం పక్కా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS