సేఫ్‌ జోన్‌లో 'కల్కి'.!

By iQlikMovies - June 20, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'కల్కి' ఈ నెల 28న ప్రేక్షుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా వినూత్నంగా సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు. 'అ'తో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ప్రోమోస్‌ సినిమాపై అంచనాల్ని పెంచేలా ఉన్నాయి. ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. సో సినిమాకి ఉండాల్సినంత గ్లామర్‌ పాళ్లూ కూడా ఉన్నాయి.

 

రాజశేఖర్‌ నటించిన 'గరుడవేగ' సినిమాలో సన్నీలియోన్‌ ఐటెం సాంగ్‌ ఓ ఊపు ఊపేసింది. అలాగే ఈ సినిమాలోని 'హారన్‌ ప్లీజ్‌' సాంగ్‌ కూడా ట్రెండింగ్స్‌లో నిలిచింది. ఈ సాంగ్‌ని ప్రమోట్‌ చేస్తూ, రాజశేఖర్‌ కూతురు శివాత్మిక, కో స్టార్‌ ఆనంద్‌ దేవరకొండతో కలిసి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ సాంగ్‌కి వీరిద్దరూ చేసిన డాన్స్‌ క్లిప్పింగ్‌ నెటిజన్స్‌ని కాస్త డిఫరెంట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. వీరిద్దరూ కలిసి 'దొరసాని' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎట్‌ ఏ టైమ్‌ ఇటు 'దొరసాని'నీ, అటు తండ్రి సినిమా 'కల్కి'ని ప్రమోట్‌ చేసేస్తోంది తెలివిగా శివాత్మిక.

 

ఇక 'కల్కి' బిజినెస్‌ విషయానికి వస్తే, శాటిలైట్‌ రైట్స్‌, డిజిటల్‌ రైట్స్‌ భారీ మొత్తంలో అమ్ముడుపోయాయట. సో 'కల్కి' నిర్మాతలు ఈ విషయంలో హ్యాపీగా ఉన్నట్లు సమాచారమ్‌. రాజశేఖర్‌కి సెంకడ్‌ ఇన్నింగ్స్‌లో వచ్చిన 'గరుడవేగ' మంచి విజయం అందించింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ ఇంపాక్టే ఇప్పుడు తాజా సినిమా బిజినెస్‌ని ప్రభావితం చేసింది. ఏది ఏమైతేనేం బిజినెస్‌ పరంగా 'కల్కి' సేఫ్‌ జోన్‌లో ఉన్నాడు. ఇక విడుదలయ్యాక కంటెంట్‌ని బట్టి ఫైనల్‌గా సినిమాకి ఎలాంటి తీర్పునిస్తారో ఆడియన్స్‌.. వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS