జై లవ కుశ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే లీకుల బారిన పడింది.
అందుతున్న వివరాల ప్రకారం, జై లవ కుశ టీజర్ కి సంబందించిన రఫ్ కట్ ని అంతర్జాలంలో పెట్టేశారు. దీనితో ఒక్కసారిగా జై లవ కుశ టీం షాక్ అయ్యింది.
వెంటనే తేరుకుని చిత్ర నిర్మాతలు పోలీసులని ఆశ్రయించగా వారు కూడా వెంటనే ఈ లీక్ కి పాల్పడినట్టు అనుమానిస్తున్న గణేష్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇక చిత్ర యూనిట్ కూడా లీక్ అయిన టీజర్ రఫ్ కట్ అని ఫైనల్ కట్ ఇంకా చేయలేదు అని చెప్పారు.