ఇజం తరవాత కల్యాణ్ రామ్ సినిమా ఏంటన్నది ఇంత వరకూ తేలలేదు. మధ్యలో కొంతమంది దర్శకులు కథలు వినిపించినా.. అదేం ఓకే కాలేదు. ఇప్పుడు ఓ కొత్త దర్శకుడికి కల్యాణ్ రామ్ ఛాన్సిచ్చినట్టు తెలుస్తోంది. శ్రీనువైట్ల దగ్గర సహాయకుడిగా పనిచేసిన ఉపేంద్ర... కల్యాణ్ రామ్ కోసం ఓ కథ రెడీ చేయడం, వినిపించడం జరిగిపోయాయని టాక్. ఈ చిత్రానికి ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా కోసం ఇది వరకు ఈ టైటిల్ చర్చల్లోకి వచ్చింది. ఎందుకో ఎన్టీఆర్ ఈ టైటిల్‌ని పక్కన పెట్టాడు. ఇప్పుడు అన్న... కల్యాణ్ రామ్ సినిమా కోసం ఈ టైటిల్ పరిశీలించడం విశేషమే. ఇదో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌లో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇంకొంత కాలం ఆగాల్సిందే.