సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో చాలా మంది వీరిరువురు కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా అనుకున్నారు. కాని అందరికీ షాక్ ఇస్తూ ఇద్దరూ విడిపోయారు.
కాని చాలా కాలం తరువాత మళ్ళీ ఇద్దరు కలిసారు. అయితే వీరి కలయికకు కారణం ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న టైగర్ జిందా హై చిత్రం. ఏక్ థా టైగర్ చిత్రానికి గాను వీరిద్దరూ చేసిన నటన హైలైట్ గా నిలిచింది.
దీనితో దర్శక నిర్మాతలు మళ్ళీ వీరిరువురిని సీక్వెల్ కి కూడా తీసుకోవాలని పట్టుబట్టి వీరిని ఒప్పించారు. మరి చూద్దాం.. ఈ హిట్ పెయిర్ మళ్ళీ జనాలను ఎంతవరకు మెస్మరైజ్ చేస్తుందో...