కరోనాపై ప్రపంచం అంతా యుద్ధం చేస్తోంది. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రులు పేషెంట్లతో నిండిపోతున్నాయి. కరోనా బాధితులు పెరిగితే.. ప్రస్తుతం ఉన్న ఈ సదుపాయలు అస్సలు సరిపోవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తన వంతు సహాయం చేయడానికి కమల్ హాసన్ ముందుకొచ్చాడు. చెన్నైలోని తన నివాసాన్ని తాత్కాలిక ఆసుపత్రిగా మార్చుకోమని ప్రభుత్వాన్ని కోరాడు కమల్.
కరోనా బాధితుల కోసం తన ఇంటికి ఆసుపత్రిగా మార్చుకోవడానికి అనుమతి ఇస్తున్నానని, ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఇప్పటికే చాలామంది తమిళ స్టార్స్ భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. కమల్ అయితే.. ఓ అడుగు ముందుకేసి తన ఇంటినే తాత్కాలిక ఆసుపత్రి కోసం ఇవ్వడానికి ముందుకొచ్చాడు. కమల్ ఉదార స్వభావానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.