రాక రాక మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. మరి... అభిమానులు ఘన స్వాగతం పలకకుండా ఎలా ఉంటారు? చిరుని సోషల్ మీడియా ప్రపంచంలోకి ఘనంగా ఆహ్వాచించారు ఫ్యాన్స్. తొలి 24 గంటల్లో ఆయన ఫాలోవర్స్ 1.33 లక్షలకు చేరుకుంది. తొలిరోజే ఆయన మూడు ట్వీట్లు చేశారు. దానికి నాగార్జున, మోహన్‌లాల్. రాధిక, సుహాసిని లాంటి సెలబ్రెటీలు రీ ట్వీట్ చేశారు. ఇన్‌స్ట్రాలో చిరు తొలి ఫొటోని పోస్ట్ చేశారు. తల్లి అంజనాదేవితో తీసుకున్న సెల్ఫీ... బాగానే వైరల్ అయ్యింది.
చిరు ప్రస్తుతం `ఆచార్య` సినిమా పనుల్లో ఉన్నారు. వీటికి సంబంధించిన అప్ డేట్స్‌ని ఇక చిరు ట్విట్టర్‌లో చూసేయొచ్చు. రామ్ చరణ్‌కి సంబంధించిన సినిమా విశేషాలు కూడా చిరు ట్విట్టర్‌లో కనిపిస్తుంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇంత వరకూ అల్లు అర్జున్ హవా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్ స్ట్రాలో బన్నీదే హంగామా అంతా. ఇప్పుడు చిరు బన్నీని బీట్ చేసే అవకాశం ఉంది.