టీవీ ఆర్టిస్ట్ ప్రదీప్ ఆత్మహత్య వార్త తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది.
ఇక అతని మరణం పై పలు అనుమానాలు వెలువడిన నేపధ్యంలో ప్రదీప్ పోస్ట్ మార్టం రిపోర్టు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పోస్ట్ మార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు మాత్రం ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్టు ద్రువీకరించారు.
దీనితో ప్రస్తుతానికి ప్రదీప్ మరణం పై నెలకొన్న అనుమానాలు తొలిగిపోయాయి అని తెలుస్తుంది. ఇక ప్రదీప్ భార్య పావని రెడ్డి కూడా ప్రదీప్ అత్మహత్య జీర్ణించుకోలేకపొతున్నారు.
ఏదైతేనేమి తొందరపాటుతో ప్రదీప్ తన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగించడం భాధాకరం.