లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్న తరుణంలో ఈ సంవత్సరపు ఆయన పుట్టినరోజుకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆ వేడుకలకి ఆయన నో చెప్పడం జరిగింది.
దీనికి కారణం- ప్రస్తుతం తమిళనాడులో అందులోన ముఖ్యంగా చెన్నైలోని పలు ప్రాంతాలు వరదల భారీన పడిన తరుణంలో ఆయన తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ఆయన తన అభిమానులకి కూడా చెప్పి వేడుకలు చేసుకోకుండా అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరాడు.
ఈ క్లిష్ట సమయంలో వేడుకలు వద్దు.. సేవ చేయాలంటూ ఆయన పిలుపునిచ్చాడు. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నేపధ్యంలో ఈ నిర్ణయం ప్రజల్లో ఆయనకీ మంచి మైలేజ్ ఇవ్వనుంది అన్నది నిర్వివాదాంశం.
ఇది కమల్ హాసన్ తన పుట్టినరోజు వేడుకలని రద్దు చేయడానికి కారణం.




