పద్మావతి చిత్రం వివాదం నేపధ్యంలో నటి దీపిక పదుకొనె తలని తీసుకొచ్చిన వారికి రూ 5కోట్లు ఇస్తామంటూ కొన్ని మత సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే లోకనాయకుడు కమల్ హసన్ కూడా దీపిక పదుకొనె తల తనకి కూడా కావాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆమె శరీరానికన్నా ఆమె తలకే ప్రాధాన్యత ఇవ్వడం సబబు అని తెలియచేశాడు. ఇక ఇదే సమయంలో పద్మావతి సినిమాని అడ్డుకునేవారి ఆలోచన మారాలి అని కోరాడు.
గతంలో తన చిత్రాలకి కూడా ఇటువంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి అని గుర్తుచేశాడు. మొత్తానికి పద్మావతి చిత్రానికి దేశంలోని ప్రముఖ స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా తమ మద్దతు తెలుపుతున్నారు.
ఇదిలావుండగా ఈ చిత్రాన్ని విడుదల కానివ్వబోమంటూ ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించేశాయి.