ఐక్యరాజ్య సమితికి సంబంధించిన విభాగాల్లో అత్యంత కీలకమైన యూనీసెఫ్ సెలబ్రిటీ ఆడ్వకేట్‌గా ముద్దుగుమ్మ త్రిష ఎంపికైంది. పిల్లల సమస్యల్ని అడ్రస్ చేసే ప్రతినిధిగా త్రిష పని చేయనుంది ఈ సంస్థ తరపున. నటిగా ఎన్నో మంచి సినిమాల్లో నటించిన త్రిషకు ఈ అరుదైన గౌరవం దక్కడం ఆనందించదగ్గ విషయం.
సమాజంలో పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు త్రిష ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. వారి సమస్యలను ప్రభుత్వం తరపుకు తీసుకెళ్లి, తన ద్వారా వాటికి పరిష్కారాలను వెతికే అవకాశం కల్పిస్తుంది. పిల్లలంటే తనకెంతో ఇష్టమనీ, అయితే దురదృష్టవశాత్తూ, కొంత మంది రకరకాల కారణాలతో అనాధలుగా మారుతున్నారనీ, దారిద్య్రంలో బతుకుతున్నారనీ, అలాంటి వారిని చూస్తే తనకెంతో బాధ కలుగుతుందనీ అంటోంది త్రిష. అయితే ఈ సంస్థ ద్వారా అలాంటి పిల్లలకు సహాయం అందించే అవకాశం కల్గిందనీ సంతోషం వ్యక్తం చేస్తోంది. అలాగే చిన్నతనంలోనే అమ్మాయిలు, అబ్బాయిలు అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురౌతున్నారు. వారి బాధని ఎవ్వరికీ చెప్పుకోలేక, చిన్నతనంలో పిల్లలు అనేక మానసిక బాధకు లోనవుతున్నారు. అలాంటి వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపకరిస్తుంది. అందుకే ఈ సంస్థ ఆమెని నియమించింది.
ఈ అరుదైన గౌరవం దక్కినందుకు గర్వంగా ఫీలవుతున్నాననీ, ఈ బాధ్యతను ఎంతో అపురూపంగా భావించి తన వంతు కృషిని అందిస్తాననీ త్రిష చెబుతోంది. ప్రస్తుతం త్రిష తమిళంలో సినిమాలతో బిజీగా ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు బెస్ట్ ఆప్షన్ అయ్యింది కోలీవుడ్‌లో త్రిష. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం తనకప్పగించిన ఈ బాధ్యతను ఎంతో జాగ్రత్తగా నెరవేరుస్తానని చెబుతోంది ముద్దుగుమ్మ త్రిష.