సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్యనే లోకనాయకుడు కమల్ హసన్ పై చేసిన వ్యాఖ్యలు పెను సంచలనమే రేపాయి. రాజకీయాల్లో గెలవడానికి డబ్బు, హోదా సరిపోవు అని ఈ విషయం కమల్ కి కూడా తెలుసు అని మాట్లాడడం వివాదాస్పదంగా మారాయి.
దీనికి కౌంటర్ గా కమల్ స్పందిస్తూ- రాజకీయాల్లో గెలవడమే పరమావధి కాకూడదు అని చెబుతూ, ఇప్పటివరకు గెలిచిన ఎవరూ కూడా ప్రజలకి మంచి చేయలేదు అని విమర్శించారు. ఇక రజిని చేసిన వ్యాఖ్యలని పెద్దవిగా చూడను అని తమ మధ్య ఉన్న స్నేహం ఈ మాటలన్నిటికన్నా గొప్పది అని చెప్పాడు.
ఇదంతా గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం కమల్-రజిని లు రాజకీయాల కోసం తమ మధ్య ఉన్న స్నేహానికి ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు.