ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఎక్కడ చూసినా మనకు వినిపించే ట్రెండ్- బయోపిక్స్. ఈ రెండు చిత్రసీమల్లో దాదాపు అరడజనుకు పైగా బయోపిక్ సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి.
ఈ తరుణంలో నటి టబు ని తన బయోపిక్ ఎప్పుడు ఉండొచ్చు అని అడగగా.. నా జీవితంలో జరిగిన సంఘటనలు అంత గోప్పవేమి కావు అయినా నా జీవితంలో జరిగిన అంశాలని ఎవ్వరితోను పంచుకోవడానికి ఇష్టం లేదు అని తన మనసులో మాట చెప్పేసింది.
ఇక బయోపిక్ చేయాలంటే సదరు జీవితంలో ఆసక్తి గొలిపే అంశాలు ఉండాలి అలాంటివి తన జీవితంలో లీవు కాబట్టి నా బయోపిక్ ఉండబోదు అని స్పష్టంచేసింది.
మొత్తానికి తన బయోపిక్ పైన వస్తున్న రూమర్స్ పైన నీళ్ళు చల్లేసింది ఈ హైదరాబాద్ భామ!