లోకనాయకుడు కమల్ హసన్ పొలిటికల్ ఆరంగేట్రానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా పదునెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పక్షమైన బీజీపీ ని టార్గెట్ చేస్తూ ఆయన అంటున్న మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఈ మధ్యనే తమిళనాట ఒక ప్రముఖ పత్రికకు వ్యాసం రాసిన ఆయన హిందూ ఉగ్రవాదం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాలలో హిందూ ఉగ్రవాదం హింసాత్మక రూపు తీసుకుంట్టున్నది అని అభిప్రాయపడ్డాడు.
ఒకప్పుడు ఇది అదుపులో ఉండేది అని ప్రస్తుతం చూస్తుంటే ఇది తీవ్ర రూపంలో కనిపిస్తున్నది అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా తన రాజకీయ ప్రకటన చేయనున్న ఈ తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంట్టున్నాయి.