గత నెలలో గోవాలో ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటైన చై-సామ్ లు ఇప్పుడు హనీమూన్ కోసం లండన్ లో ఉన్నారు.
ఇక ఈ మధ్యనే వీరి రిసెప్షన్ చెన్నైలో జరగగా అందులో సమంతా కుటుంబసభ్యులు అలాగే చైతు తల్లి తరుపున దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆ వేడుకకి హజరయ్యారు. చెన్నైలో రిసెప్షన్ ముగిసాక ఇక అందరి దృష్టి చై-సామ్ ల హైదరాబాద్ రిసెప్షన్ పైన పడింది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం, నవంబర్ 12న ఈ రిసెప్షన్ కి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున ఇప్పటికే ఈ రిసెప్షన్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల్ని ఆహ్వానిస్తాను అని చెప్పడంతో ఈ రిసెప్షన్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నది అని అంచనా.
మొత్తానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రిసెప్షన్ డేట్ తెలిసిపోయింది.