సినిమా ధియేటర్స్ లో జాతీయ గీతానికి కచ్చితంగా లేచి నిలబడాలి అన్న నిబంధనను సుప్రీమ్ కోర్టు న్యాయస్థానం త్రోసిపుచ్చిన నేపధ్యంలో ఈ అంశం పై పలువురు ప్రముఖులు స్పందించారు.
అందులో ముఖ్యంగా లోకనాయకుడు కమల్ హసన్ మాట్లాడుతూ- సింగపూర్ దేశంలో ప్రతిరోజు అర్దరాత్రి వేళలో ఆ దేశ జాతీయగీతాన్ని నేషనల్ ఛానల్ లో వేస్తుంటారు. కాని అది డెమోక్రసీ ఉన్న దేశం కాదంటూ ఒక అభిప్రాయం ఉంది.. మరి మనకి కూడా అలంటి సంస్కృతే కావాలా అని సూటిగా ప్రశ్నించాడు.
ఇక ఇలా జాతీయ గీతం వచ్చిన ప్రతిసారి నిలబడితేనే దేశ భక్తీ ఉన్నట్టు కాదు అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా ఏ ప్రదేశంలో పడితే అలా తమ దేశభక్తిని పరీక్షించ వద్దు అని ఘాటుగా స్పందించాడు.