లోకనాయకుడు కమల్ హసన్ పై ఇప్పుడు తమిళ నాట కొన్ని సంఘాలు గుర్రుగా ఉన్నాయి. దీనికి కారణం ఆయన బిగ్ బాస్ తమిళ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండడమే.
బిగ్ బాస్ షో అనేది తమిళ సంస్కృతికి విగాతం కలిగించేలా ఉంది అని ఇలాంటి షోకి వ్యాఖ్యాతగా చేయడం తమిళ ప్రజల మనోభావాలకి వ్యతిరేఖం అని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ షో నుండిఆయన తక్షణమే తప్పుకోవాలని లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కమల్ హసన్ ఇంకా ఈ హెచ్చరికల పై స్పందించలేదు.
కమల్ మనసెరిగిన వారు మాత్రం, ఇలాంటి బెదిరింపులకు కమల్ లొంగడు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.