ప్రముఖ నటి సోనమ్ కపూర్ త్వరలోనే పెళ్ళి చేసుకోనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆమె ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజా తో ప్రేమలో ఉన్నట్టు అలాగే వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నట్టు ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. అయితే వీరి బంధం పై ఇంతవరకు ఇటు సోనమ్ కాని అటు ఆనంద్ కాని స్పందించలేదు.
ఇక గత రెండు మూడు రోజుల నుండి మాత్రం వీరిరువురు త్వరలోనే పెళ్ళి చేసుకోనున్నట్టు వార్తలు బాలీవుడ్ నిండా వ్యాపిస్తున్నాయి. మరి నిజంగా సోనమ్ తన కెరీర్ పీక్ లో ఉండగా పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.