కమల్ హాసన్ ని క్షమించమని అడిగిన కేటీఆర్

మరిన్ని వార్తలు

తమిళ స్టార్ హీరోలోకనాయకుడు కమల్ హాసన్ కొద్దిసేపటిలో తన రాజకీయ పార్టీ పేరుని, జెండాని, అజెండాని ప్రజలకి చెప్పబోతున్నాడు. దీనికి సంబంధించి కమల్ హాసన్ మదురైలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 

ఈ సభకి వివిధ రాష్ట్రాల నుండి ప్రముక రాజకీయ నాయకులకి ఆయన ఆహ్వానం పంపించారు. అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి కేటీఆర్ కి ఆహ్వానం అందింది.అయితే ఈ సభకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడకపోవడంతో ట్విట్టర్ వేదికగా ఆయన కోరిక మేరకు రాలేకపోయినందుకు కమల్ హాసన్ ని క్షమాపణ కోరాడు. 

అయితే కమల్ హసన్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ- సినిమాలలో మాదిరిగానే రాజకీయాల్లో కూడా మీరు మంచి ‘నాయకుడు’ కావాలని అభిలాషించారు. దీనికి ప్రతిగా ఆయాన్ మీ బిజీ షెడ్యూల్ లో తమకి కూడా తప్పకుండ సమయం కేటాయించి ఎప్పుడైనా మమల్ని కలవండి అని కమల్ కోరడం విశేషం. 

ఇది వీరిరువురి మధ్య సాగిన సంభాషణ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS