బాలీవుడ్ బ్యూటీ 'క్వీన్' కంగనారనౌత్ రాజకీయాల్లోకి రానుందంటూ గత కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదంటూ కంగనా పర్సనల్ మేనేజర్ అఫీషియల్‌గా ప్రకటన చేశారనీ ముంబయ్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. కంగనా రనౌత్ ఓ రాజకీయ పార్టీలో చేరబోతున్నారనీ, అందుకు సంబంధించి, ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారనీ ఇటీవల ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయంలో కంగనా కూడా స్పందించింది. అవన్నీ ఊహాగానాలే తప్ప వాటిలో నిజమెంత మాత్రమూ లేదనీ తాను పోలిటిక్స్‌లోకి వచ్చే అవకాశాలే లేవనీ గట్టిగా తేల్చి చెప్పేసింది.
అంతేకాదు కంగనాకి రాజకీయాలపై అస్సలు ఇంట్రెస్ట్ లేదనీ గతంలోనే పలు సార్లు చెప్పింది. అయినా కానీ ఈ ముద్దుగుమ్మ చుట్టూ ఈ గాసిప్స్ వదిలడం లేదు. ఇదిలా ఉండగా, అందాల కంగనా మరోపక్క 'మణికర్ణిక' సినిమాతో బిజీగా ఉంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్ర కోసం కంగనా పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. గుర్రపుస్వారీలు, కత్తియుద్ధాల్లో ప్రత్యేక శిక్షణ పొందింది.ఆ శిక్షణ టైంలోనే ఈ ముద్దుగుమ్మ చాలా గాయాల పాలైంది. షూటింగ్లో కూడా కంగనా గాయాలతో బాధపడుతోందట. అయినా కానీ ఈ సినిమా కోసం కంగనా ఎంతో డెడికేషన్‌తో పని చేస్తోంది. లక్ష్మీభాయ్ పాత్రలో కంగనా అందం, ఆహర్యం ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బికనీర్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.