ఇంకొన్ని రోజుల్లోనే తన రాజకీయ ఆరంగేట్రం గురించిన ప్రకటన చేయన్నున్న నేపధ్యంలో కమల్ హసన్ తమిళనాట ప్రజల్లోకి వెళ్ళే పనిని మొదలుపెట్టేశాడు.
నిన్ననే చెన్నైకి సమీపంలోని ఒక నది పరీవాహక ప్రాంతంలో ఆయన పర్యటించాడు. ఆ నదిని అక్రమార్కులు ఎలా ఆక్రమించింది అలాగే అక్కడి ప్రజానీకం ఎదురుకుంటున్న సమస్యల పై ఆరా తీశాడు. ఇక ఆయన వెంట ప్రముఖ పర్యావరణవేత్తలని సైతం తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ చేప్పట్టవలసిన పనుల గురించి ఆరా తీశాడు.
ఇదే అంశాన్ని తన ట్విట్టర్ ద్వారా కూడా అందరితో పంచుకుంటూ త్వరలోనే అక్కడి సమస్యలకి ఒక పరిష్కారం దొరకాలని కోరుకున్నాడు.
ఇదంతా చూస్తున్న వారు మాత్రం, కమల్ తన రాజకీయ అరంగేట్రానికి ముందే ఆదరగోడుతున్నాడు అంటూ అభినందిస్తున్నారు.




