నవంబర్ లో వస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'

By iQlikMovies - November 10, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

పప్పు లాంటి అబ్బాయి పాటకు విశేష స్పందన ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తీయడంలో రాంగోపాల్ వర్మకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా...విశేషమైన ఆదరణ లభించిందని....ఆదివారం ఉదయం విడుదల చేసిన పప్పు లాంటి అబ్బాయి పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో మంచి ట్రెండింగ్ లో ఉందని చిత్రబృందం వెల్లడించింది.

 

నవంబర్ 29 న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయని వారు వివరించారు. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు: టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS