వర్మలో ఓ మ్యాజిక్ ఉంటుంది. క్రియేటివిటీని, కాంట్రవర్సీతో కలిపి కొట్టడం వర్మకి వోడ్కాతో పెట్టిన విద్య. తన సినిమాలకు బ్రాండింగ్ ఎలా చేసుకోవాలో తనకు బాగా తెలుసు. కేవలం ఒకే ఒక్క షాట్‌తో `కమ్మ రాజ్యంలో కడపరెడ్లు` సినిమాకి బోలెడంత ప్రచారం తీసుకొచ్చాడు. ప్లేటులో ముద్దపప్పు వడ్డించే షాట్ వైరల్‌లా మారింది. దానికి తోడు ఇప్పుడు ఓ పాట కూడా విడుదల చేశారు. అది కాస్త.. పటాస్‌లా పేలుతోంది. ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్ వచ్చేశాయి. అభినందనలోని చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి పాటని, ముద్దపప్పు స్టైల్‌కి తగ్గట్టు మార్చుకుని పేరడీ చేశారు.
రెండు పాత్రల మధ్య సంభాషణలా సాగిందా పాట. ఆ పాట రాసిన విధానం, అందులో నిజ జీవిత పాత్రలు కళ్లముందు కనిపిస్తున్న పద్ధతి- ఆ పాటని వైరల్ చేశాయి. ఈ పాట కోసమైనా జనం సినిమా చూస్తారేమో.. అన్నంత స్థాయిలో వినిపిస్తోందా పాట. కమ్మరాజ్యంలో - కడపరెడ్లు అనే టైటిల్ కాకుండా ఈ సినిమాకి ముద్దపప్పు అనే టైటిల్ పెట్టుంటే బాగుండేదేమో. మొత్తానికి వర్మ స్ట్రాటజీ మరో సారి ఫలించింది. ఈ సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.