'సర్కార్', 'మారి 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచిన ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్. ఆయా సినిమాల్లో ఆమె నటనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మనసులో వరలక్ష్మి ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. తమిళంలోనే కాదు, స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపుతున్న వరలక్ష్మి కోసం మన తెలుగు దర్శక నిర్మాతలు కూడా మంచి మంచి పాత్రలు సిద్ధం చేస్తున్నారట. ఆ క్రమంలోనే యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'తెనాలి రామకృష్ణ' సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు వరలక్ష్మి ఖాతాలో మరో తెలుగు సినిమా జాయిన్ అయ్యిందనీ తెలుస్తోంది.
మాస్ రాజా రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో వరలక్ష్మి నటిస్తోందట. అయితే, వరలక్ష్మి పాత్ర నెగిటివ్ షేడ్స్‌లో ఉండబోతుందా.? లేదా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం, ఫ్రెష్ అప్పీల్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ని లేడీ విలన్‌గానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రవితేజ 'డిస్కోరాజా' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.