'ఖైదీ'.. చిరంజీవి జీవితంలో ఓ మేలిమి మలుపు. అదే టైటిల్‌ని తన సినిమాకి పెట్టుకున్నాడు కార్తి. ఆ సెంటిమెంట్ ఫలించి, కార్తికి కూడా ఓ మంచి విజయం దొరికింది. ఇప్పుడు మరోసారి మెగా టైటిల్‌పైనే కన్నేశాడు కార్తీ. కార్తి, జ్యోతిక కలసి ఓ సినిమాలో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 'దృశ్యం'లాంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు జోసెఫ్. ఆ సినిమా ఎంత విజయవంతం అయ్యిందో తెలిసిన విషయమే.
మరోసారి అలాంటి వైవిధ్యభరితమైన కథని ఎంచుకున్ఆరు రీతూ జోసెఫ్. ఇందులో జ్యోతికకు తమ్ముడిగా కార్తి నటిస్తున్నారు. తమిళంలో 'తన్నీ' అనే పేరు పరిశీలనలో ఉంది. తెలుగులో 'తమ్ముడు' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నార్ట. 'తమ్ముడు' అనగానే పవన్ కల్యాణ్ సినిమా గుర్తొస్తుంది. పవన్ కెరీర్‌లో అదో సూపర్ హిట్ సినిమా. ఆ టైటిల్ తనకు కూడా హిట్ తీసుకొస్తుందని కార్తి నమ్మకం. త్వరలోనే ఈ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.