'మత్తు వదలరా' ఫస్ట్‌లుక్‌: అంతా కొత్తవాళ్లే.!

మరిన్ని వార్తలు

ఓ స్టార్‌ హీరో చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కాబోతోంది.. అంటూ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌కి ముందు ఓ రేంజ్‌లో ఆసక్తి కలిగించిన సినిమా 'మత్తు వదలరా'. ఎట్టకేలకు ఆ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇంతకీ ఎవరు విడుదల చేశారంటే, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్‌ విడుదలైన ఈ సినిమా వివరాల్లోకి వెళితే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.

 

ఇదే సినిమాతో ఆయన పెద్ద కుమారుడు కాల భైరవ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమవుతుండడం విశేషం. అతేకాదు, రితేష్‌ రానా అనే ఓ యంగ్‌స్టర్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అంతేకాదు, నరేష్‌ అగస్థ్య, అతుల్య చంద్ర తదితర నటులు కూడా ఈ సినిమాతోనే నటనకు పరిచయమవుతున్నారు. మరో విశేషమేంటంటే, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి, మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

 

ఫస్ట్‌లుక్‌లో చాలా చాలా అంశాలు రివీల్‌ చేశారు. వాటిని బట్టి చూస్తే ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలా ఉంది. అయితే, కాన్సెప్ట్‌ థ్రిల్లర్‌ అయినా, కథను చాలా ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారట. ఖచ్చితంగా ఈ ట్రెండ్‌కి నచ్చే మూవీ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదికెళ్లనుంది. అన్నట్లు శ్రీ సింహా, కాల భైరవలను 'నా తమ్ముళ్లు..' అని సంబోధిస్తూ ఎన్టీఆర్‌ ఈ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS